Entertainment సమంత పేదన పాత్రలో నటించిన చిత్రం శకుంతల ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు అయితే ఈ సినిమా ప్రకటించి దాదాపు రెండు సంవత్సరాలు అయినప్పటికీ పలు కారణాలతో ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది అలాగే షూటింగ్ చేసుకోవడం కూడా లేట్ అయింది అయితే తాజాగా ఈ సినిమాకు చిత్రీకరణ పూర్తయిపోయి అన్ని పనులు పూర్తయి విడుదలకు కూడా డేట్ ఫిక్స్ అయిపోయింది దీనిపై సమంత అభిమానులు వ్యక్తం చేస్తున్నారు..
గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శకుంతల చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకి రాబోతున్నట్టు ప్రకటించింది చిత్ర బంధం ఫిబ్రవరి 15 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు తాజాగా ట్విట్టర్ వేదికగా తెలిపింది.. కొత్త సంవత్సరం ప్రారంభం లో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని తెలుపుకొచ్చింది చిత్ర బృందం.. అలాగే “2023 ఫిబ్రవరి 17 నుంచి మీ సమీప థియేటర్లలో ఎపిక్ లవ్ స్టోరీ ‘శాకుంతలం’ వీక్షించండి. 3D వెర్షన్‌లో సైతం!!” అంటూ సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్‌తో కూడిన రిలీజ్ పోస్టర్‌ను పోస్ట్ చేశారు.
మైథిలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.. అలాగే ఈ సినిమాలతో అల్లు అర్హ సినీ అరంగేట్రం చేయబోతుంది అల్లు వారి కుటుంబం నుంచి నాలుగో తరం సినిమాల్లోకి అడుగుపెట్టబోతుంది.. అందుకే ఈ సినిమా విడుదల కోసం ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపు రెండేళ్ల నుంచి ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ హల్చల్ చేస్తూనే వస్తుంది 2021 అక్టోబర్లో ఈ సినిమాను ప్రకటించిన నుంచి ఇప్పటివరకు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పాలి