Politics కొన్నిసార్లు పరిస్థితులు బాగోకపోతే ఏం చేసినా చెడుగానే జరుగుతుంది అనటానికి నిదర్శనం ఇదేనేమో తాజాగా కందుకూరి సంఘటన మరువకముందే మళ్ళీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన గుంటూరు సభలో తొక్కిసలాట జరిగింది ఈ సందర్భంగా పలువురు గాయాలు పాలవటమే కాకుండా మృతి చెందారు..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి అతనికి ప్రతి విషయం కలిసి రావట్లేదని చెప్పాలి అతను సభలోనే అతను టిడిపికి ఓటు వేయొద్దు అనటం అలాగే తాజాగా నిర్వహించిన కందుకూరి సంఘటనలో 8 మంది చనిపోవడం మరల అలాంటి సంఘటన తాజాగా గుంటూరులో చోటు చేసుకోవడం అన్ని చూస్తూ ఉంటే అదే అనిపిస్తుంది..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సభలో మళ్లీ తోపులాట జరిగింది.. ఎప్పటికప్పుడు అపశృతులు నెలకొంటూనే వస్తున్నాయి.. ఎంతగా జనాల్ని కట్టడి చేసి కార్యక్రమాన్ని సక్రమంగా నడిపిద్దామన్న ఏదో ఒకటి జరుగుతూనే వస్తుంది.. గత కొన్ని రోజుల క్రితమే నెల్లూరు జిల్లాలో జరిగిన కందుకూరి ఘటన మరవకముందే ఈ సంఘటన అందర్నీ కలిసి వేసింది.. గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంపిణీ జరిగిన అనంతరం చంద్రబాబు ప్రసంగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత అక్కడ గందరగోళం నెలకొంది ఈ ఘటనలో ఒక మహిళ చనిపోయింది.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.