Megastar Chiranjeevi Family Remake Movies
* వకీల్ సాబ్ – హిందీ పింక్ కి రీమేక్
* పవన్ తర్వాతి సినిమా మలయాళం – అయ్యప్పన్ కౌశికుయుం..
* చిరంజీవి నెక్స్ట్ మూవీ మలయాళం – లూసిఫర్
* టాలీవుడ్ కథకులపై మెగా ఫ్యామిలీకి నమ్మకాల్లేవా?
* ఇక్కడే ఒక కొత్త కథ పుట్టించేంత దమ్మూ – ధైర్యం లేదా?
* టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ గా మెగా – రీమేకులు
వకీల్ సాబ్ వచ్చింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓకే. పవన్ తర్వాతి చిత్రం.. అయ్యప్పన్ కౌశికుయుం కూడా వస్తుంది. హిట్టవుతుంది ఓకే. ఇక మెగా బిగ్ బ్రదర్ చిరంజీవి లూసిఫర్ కూడా వస్తుంది. హిట్టయ్యి ప్రేక్షకులను అలరిస్తుంది. కాదనడం లేదు. మరి తెలుగులో కథల కొరత లాగా.. అన్నీ బయట చిత్రాలే రీమేకులు చేస్తోంది మెగా ఫ్యామిలీ. కారణమేంటి? ఇండస్ట్రీలో కథల కొరత ఉన్నట్టు.. బయట చిత్రాలను రీమేక్ చేయడం ఏంటన్నది టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్.
మెగా ఫ్యామిలీకి తెలుగులో కొత్త కథలను బ్రేక్ చేసే దమ్ము లేదా? ఉంటే ఈ పొరుగింటి కథలేంటి? అని అందరికీ అనుమానం రావచ్చు. ఆ మాటకొస్తే.. మెగాస్టార్ చిరంజీవి సైరా, ఆచార్య ఇక్కడి కథలే కదా? దానికి తోడు.. ఆచార్య కథ మాదీ అంటూ ఒక యువ దర్శకుడు రచ్చకీడ్చింది తెలిసిందే కదా? అనొచ్చు.
ఇక్కడే ఉంది అసలు చిక్కంతా? ఇక్కడ కథలను టచ్ చేయాలంటే ఇదే భయం – బాధ. ఎందుకంటే ఈ కథల మీద విపరీతమైన వివాదాలు తయారవుతుంటాయి. అదే పరభాషలో సూపర్ హిట్టయిన సినిమాలు కొనుక్కుంటే.. ఏ గొడవా ఉండదు. దానికి తోడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఉంటాయి కూడా. ఇలాంటి కథలు కొనుక్కుంటే.. మొదట మార్కెట్ హైప్ క్రియేట్ చేయవచ్చు. ఆ తర్వాత అక్కడ సూపర్ హిట్టయిన వసూళ్ల గణాంకాలను చెప్పుకుని.. ప్రాజెక్టుకు మంచి క్రేజీ సంపాదించవచ్చన్నది మెగా ఫ్యామిలీ బేసిక్ ఐడియాగా తెలుస్తోంది.