Entertainment ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త సినిమాల సంగతి పక్కన పెడితే 20 ఏళ్ల క్రితం వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా సందడి చేస్తుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా హడావిడి వినిపిస్తూనే ఉంది అయితే తాజాగా ఈ సినిమాకి మరో హైప్ క్రియేట్ చేశాడు అకిరా నందన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ తాజాగా ఖుషి సినిమాను థియేటర్లో చూశాడు. హైదరాబాద్లో దేవి థియేటర్లో అభిమానులతో కలిసి ఈ సినిమాను చూశాడు అకిరా దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. పింక్ కలర్ టీషర్ట్ వేసుకొని.. మాస్క్ పెట్టుకుని కనిపించాడు ఆకీరా.. అలాగే అభిమానులు అందరితో కూర్చుని సామాన్యంగా సినిమా చూశాడు.. అలాగే బయటకు వస్తున్న సమయంలో ఇతన్ని చూసిన అభిమానులంతా తమ కెమెరాల్లో బంధించారు మెగా హీరో అంటూ కామెంట్లు చేశారు..
అకీరా నందన్ సినిమా ఎంట్రీ పైన కూడా ఇప్పటివరకు ఎన్నో చర్చలు జరుగుతూనే వస్తున్నాయి అలాగే ..త్వరలోనే హీరోగా రాబోతున్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని అందరూ అనుకుంటున్నా ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు కానీ అకీరా మాత్రం పలు విషయాల్లో అభిమానులతో టచ్ లో ఉండటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎన్నో ఫోటోలు సినిమాలకు సంబంధించి తనదైన స్టైల్ లో స్పందించిన అకీరా తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచాడు..