Entertainment సెలబ్రెటీల్ అంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయారు కొందరు ఫారిన్ చెక్కేస్తే మరి కొందరేమో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు మరికొందరు మాత్రం పార్టీలో మునిగి తేలుతున్నారు ఇందులో ముందున్నాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..
సెలబ్రిటీలంతా తమ న్యూ ఇయర్ వేడుకల్లో సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వస్తున్నారు అయితే తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను విడుదల చేశాడు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.. ఇప్పటికే అందరం తమ న్యూ ఇయర్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉండగా ఈ ఫోటో మాత్రం ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.. ఇందులో స్విమ్మింగ్ పూల్‌లో షర్ట్‌లెస్ గా కనిపించిన విజయ్.. షాంపైన్‌ను ఆస్వాదిస్తు కనిపించడు.. అతని లుక్, స్మైల్ అమ్మాయిలు గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది అలాగే ఎంతో ఆనందంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన విజయ్.. ‘కష్టపడి నవ్విన, నిశ్శబ్దంగా ఏడ్చిన, లక్ష్యాలను సాధించిన, గెలిచిన, కొన్ని కోల్పోయిన క్షణాలతో కూడిన సంవత్సరం. మనం ప్రతిది సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అదే జీవితం. నా ప్రియమైనవారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని పోస్టు చేశాడు.
అలాగే ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు న్యూ ఇయర్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసుకున్నారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన న్యూ ఇయర్ ఫోటోలను షేర్ చేసుకోగా కమల్ హాసన్ యాంకర్ లాస్య వీరందరూ అభిమానులతో తమ ఫోటోలను పంచుకున్నారు..