Crime దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు ఇంకా రోజురోజుకీ ఇవి పెరిగిపోతూనే వస్తున్నాయి ఎక్కడ చూసినా మానభంగాలు జరుగుతూనే ఉంటున్నాయి తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది..
మహిళలపై జరుగుతున్న అఘైత్యాలు ఆగటం లేదు సరి కదా ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ సంఘటన చోటుచేసుకుంది ఉత్తరప్రదేశ్ నాయిడాలో బుధవారం తెల్లవారుజామున ఒక యువతపై సామూహిక అత్యాచారం జరిగింది.. 23 ఏళ్ల యువతపై యమునా ఎక్స్ప్రెస్ హైవే పై ఈ సంఘటన జరిగింది ఇందులో నిందితులైన టాక్సీ డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు..
బాధితురాలు నోయిడాలోని ఓ ప్రైవేట్ గార్మెంట్ కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తుంది ఈమె నోయిడా నుంచి ఫిరోజాబాద్కు టాక్సీలో వస్తుంది తన స్వస్థానానికి తిరిగి వెళుతున్న సమయంలో ఆక్సీ డ్రైవర్ పాల్పడ్డాడు నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి మరో ఇద్దరిని పిలిచి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు..
కాన్పూర్‌లోని తన స్వస్థలం ఔరయ్యకు వెళ్లాల్సి ఉందని అందుకోసం ఫిరోజాబాద్ వరకు టాక్స్ ఎలా వెళ్లడానికి నిర్ణయించుకున్నట్టు తెలిపింది.. అలాగే రాత్రి 8.30 గంటలకు నోయిడాలోని సెక్టార్ 37 నుండి బయలుదేరినట్లు తెలిపింది.. యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని, ఆపై ఎత్మాద్‌పూర్ దగ్గర వదిలివేసి ఫిరోజాబాద్‌కు ఆటోలో ఎక్కించారని ఆమె చెప్పింది. అయితే బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది అలాగే టోల్ ప్లాజా దగ్గర ఉన్న సిసి టీవీని పరిశీలించారు పోలీసులు వెంటనే టాక్సీ డ్రైవర్ తోపాటు మిగిలిన వారిని పట్టుకున్నారు..