Bhakthi : కొందరు ప్రత్యేక సందర్భాల్లో ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో పండగల పూట మౌన వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే దీని వెనక ఉన్న నిజమైన ఆంతర్యం ఏమిటి అంటే.. ఇంద్రియాలు అన్నీ కూడా ఏకమై మానసిక స్వాంతన దొరుకుతుందని తెలుస్తుంది
మునులు ఆచరించే విధానాన్ని మౌనము అంటారు అంటే మౌన వ్రతాన్ని మునులు ఆచరించే విధంగా చెప్పవచ్చు.. మౌన వ్రతంలో దేహాన్ని దైవంగా భావించాలి.. ముఖ్యంగా మనం ప్రతినిత్యం 5 ఇంద్రియాలతో మన పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటాము వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వటమే మౌనవ్రతం ఇందులో భాగంగా శరీరం కళ్ళు చెవులు నాలుక ముక్కు వాటి అన్నిటికీ శాంతి ఇవ్వటం.. ముఖ్యంగా మన రోజువారి జీవితంలో కొనసాగించే చాలా విషయాలకు విశ్రాంతి ఇచ్చి కేవలం ధ్యానం పైన దృష్టి పెట్టాలి.. ఇంద్రియాలు అన్నిటిని మన అదుపులో పెట్టుకోవడానికి చేసే విషయాలలోనే మౌన వ్రతం కూడా ఒకటిగా చెప్పవచ్చు..
అయితే ఇలా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న మిగతా ఇంద్రియాలు అన్నీ కూడా ఏకమై మానసిక స్వాంతన దొరుకుతుందని తెలుస్తుంది ఇందులో భాగంగా శరీరాన్ని ఎవరు తాకకుండా కళ్ళతో ఏదీ చూడకుండా చెవులు వీటిని వినకుండా నోటితో ఏ ఆహారాన్ని తీసుకోకుండా ముక్కుతో కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చేస్తూ ఇంద్రియాలు అన్నిటిని ఒక తాటిపైకి తేవడమే మౌనవ్రతం.. అలాగే ఎవరైనా మౌనవ్రతాన్ని పాటించాలి అనుకుంటే ఆ రోజు కచ్చితంగా ఉండాలి అలాగే ఆ రోజున ద్రవ ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.. దైవ ధ్యానం పై దృష్టి ని అంతా మంచి వ్రతాన్ని కొనసాగించాలి..