Crime ప్రేమ పేరుతో రోజురోజుకి అమ్మాయిల్ని వేధించేవారు ఎక్కువైపోతున్నారు.. ఎక్కడికి వెళ్లినా అమ్మాయిలకు అసలు రక్షనే ఉండటం లేదు.. ముఖ్యంగా టీనేజ్ లో మంచి, చెడు తెలియక అబ్బాయిలు ప్రవర్తించే తీరు అమ్మాయిలు జీవితాల్ని నాశనం చేస్తుంది.. తాజాగా జరిగిన ఓ సంఘటన లో ఓ అమ్మాయి ప్రాణం పోయింది..
తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఓ సంఘటన అందర్నీ కలిసి వేస్తుంది.. ఇంటర్ చదువుకునే వయసులో ప్రేమ పేరుతో ఒక అబ్బాయి తన క్లాస్మేట్ ను వేధించడంతో ఆ అమ్మాయి తీవ్ర భయాందోళనకు గురైంది.. చివరికి అతను వేధింపులతో ప్రాణం సైతం తీసుకుంది..
వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సతీష్ అనే వ్యక్తి ఇంటర్ చదువుతున్నాడు.. అదే కాలేజీలో చదువుతున్న త్రిష అనే అమ్మాయిని కొన్నాళ్ల నుంచి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.. ఆరు నెలల నుంచి ఈ బాధ భరిస్తున్న ఆ అమ్మాయి కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్నీ ఇంట్లో వాళ్లకు చెప్పింది.. వాళ్లు అబ్బాయికి వార్నింగ్ కూడా ఇచ్చారు.. అయితే ఈ విషయం మనసులో పెట్టుకొని ఎవరూ లేని సమయంలో వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను ప్రేమిస్తావా లేదా పురుగుల మందు తాగి చస్తావా అంటూ తనతో పాటు పురుగుల మందు కూడా తీసుకొచ్చాడు.. ఆ అమ్మాయి ఎంతగా వారించిన అతను వినకపోవడంతో చేసేది ఏమీ లేక అమ్మాయి పురుగుల మందు తాగింది.. దీంతో ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆమె సోదరి ఇదంతా చూసి కేకలు వేయడంతో.. ఆ అబ్బాయి అక్కడి నుంచి పారారయ్యాడు.. దగ్గరలో ఉన్న వారంతా వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది.. ఈ సంఘటనపై అమ్మాయి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎలాగైనా అతనికి శిక్ష పడేటట్టు చేయాలని కోరారు..