Politics తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ విషయం పై ఎవరు కచ్చితంగా తేలుస్తామని అలాగే దీనిపై సిబిఐ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు..
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఈ విషయంపై ఎవరు నోరు మెదపడం లేదంటూ అయితే అసలు దోషి ఎవరు అంటూ ప్రశ్నించారు అలాగే.. ఈ విషయంపై అధికార తెరాస బిజెపి పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయే తప్ప అసలు విషయాన్ని బయటకు రానివ్వడం లేదని అన్నారు కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని అసలు విషయాన్ని తొందర్లోనే తెలుస్తామని అన్నారు.. అలాగే ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో ఒకరు దోషగా ఉంటే మరొకరు బాధితుడుగా ఉందని అన్నారు.. అలాగే పార్టీలు రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్నారు. 2018 నుంచి జరిగిన ఫిరాయింపులపై విచారణ జరగాలని, త్వరలో ఈ అంశంపై తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని రేవంత్రెడ్డి అన్నారు.
అలాగే “ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలను బాధితులుగా చూపిస్తున్నారు. మరి ఇందులో దోషి ఎవరు? నేరం జరిగింది.. కానీ విచారణ తామే చేస్తాం అనడం ద్వారా టీఆర్ఎస్ లోపం బయటపడింది. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుంది. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే టీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని.. ” టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు.