Bhakthi బల్లి కోసం హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక శాస్త్రవే ఉంది దీని పేరు వినగానే ఒక రకమైన కేతరింపు మనుషుల్ని ఆవహిస్తుంది. అయితే ఇప్పటివరకు బల్లి శకునం బై ఉన్న నిజాలు అపోహలు ఏంటంటే..
బల్లి పేరు వినగానే అందరూ ఏదో అందరూ కీడుగానే భావిస్తారు అలాగే ఏదో తెలియని చిదరింపు మనుషుల్ని ఆవహిస్తుంది ఇళ్లలో గోడలకి ఆతుక్కొని ఉండే బల్లి మన మీద పడిన వంటల్లో పడిన ఎంతో ఆందోళనకు గురవుతారు అయితే బల్లి శాస్త్రం ఎల్లవేళలా చెడునే సూచించదు. కొన్ని శరీర భాగాలపై పడినప్పుడు చెడు ఎలా జరుగుతుందో మరికొన్ని శరీర భాగాలు పై పడినప్పుడు మంచి అదే విధంగా జరుగుతుందని తెలుపుతుంది..
అయితే గత వేల సంవత్సరాల క్రితం కొన్ని రకాలు బల్లి జాతులకు చెందినవి ప్రాణాంతకంగా ఉండేది ఆ భయమే అప్పటినుంచి ఇప్పటివరకు కొనసాగుతుందని తెలుస్తోంది అలాగే బల్లి శరీరంపై స్వల్ప స్థాయిలో విషం ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు అందుకే ఈ బల్లి ఆహార పదార్థాలలో కానీ తాగే నీటిలో కానీ పడితే చెడుగా భావిస్తారు అది శరీరం పైన పడితే చెడు జరుగుతుంది అని నమ్మకం వచ్చింది. అయితే అన్నివేళలా చెడే కాదు అని మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే హిందూ సాంప్రదాయాలు ప్రకారం బల్లి మన శరీరం మీద పడినా కానీ ఏమీ జరగకుండా ఉండాలి అంటే కంచి వెళ్లి అక్కడ ఉండే బంగారు వెండి బల్లులను పట్టుకోవాలని కూడా మన సాంప్రదాయాలు తెలుపుతూ ఉంటాయి..