Crime మారి పోతున్న రోజుల్లో తల్లితండ్రులను ప్రతిక్షణం కంటికి రెప్పలా చూసుకుంటున్న వారు కుమార్తెలే అంటూ నిరూపితం అవుతుంది తాజాగా ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.. ఒక తండ్రికి కుమారుడు ఉన్నప్పటికీ పలు కుటుంబ సమస్యలను నేపథ్యంలో అతను తండ్రికి కర్మకాండలు చేయడానికి నిరాకరించాడు దీంతో అతనికి కూతురే అన్ని అయి కర్మకాండలు నిర్వహించింది..
ఎవరు చనిపోయిన వారికి కొడుకులే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు అయితే ఒకవేళ మగపిల్లలు లేకపోతే అలాంటివారికి దగ్గర బంధువుల్లో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు మాత్రం ఎలాంటి విషయాలకు దూరంగా ఉంటారు ఇప్పటికి మహిళలు ఎన్నో విషయాలు దూసుకు వెళ్తున్న ఈ విషయాలకు మాత్రం దూరమే అయితే ఇప్పటికే పలుచోట్ల కొన్ని సందర్భాల్లో మహిళలు తల్లిదండ్రులకు కర్మకాండలు నిర్వహించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి… తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలో చోటుచేసుకుంది ఒక తండ్రికి కుమారుడు ఉన్నప్పటికీ పలు కుటుంబ సమస్యలను నేపథ్యంలో అతను తండ్రికి కర్మకాండలు చేయడానికి నిరాకరించాడు దీంతో అతనికి కూతురే అన్ని అయి కర్మకాండలు నిర్వహించింది.. .. ఆ ప్రాంతానికి చెందిన సూరిశెట్టి సాంబశివరావు కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. ఆయనకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా, ఇద్దరికీ వివాహం చేశాడు. కుమారుడు విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే వాళ్ళ కుటుంబ సమస్యలతో అతను మరణించగా కర్మకాండలు చేయటానికి కుమారుడు నిరాకరించాడు. దాంతో కుమార్తె ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది..