Bhakthi శుభ కార్యము ఏదైనా పట్టు వస్త్రాలకు ఉండే ప్రాధాన్యత వేరు.. పెళ్లి పూజ ఇటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా పట్టు చీరలు ధరిస్తూ ఉంటారు అలాగే మగ ఆడవారు ఇద్దరికీ కూడా పట్టు వస్త్రాలు ధరించడం హిందూ సంప్రదాయంలో భాగంగా ఉంది అలాగే ముఖ్యంగా ఆడవారికి ఈ పట్టు వస్త్రాలతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది అయితే ఇంతగా బంధాన్ని పెనవేసుకున్న ఈ పట్టు వస్త్రాలు ఎందుకు ధరించాలి అంటే..
ఈ భూమ్మీద జీవించి ఉన్న ప్రతి ప్రాణి చుట్టూ పోరా అనబడే సప్తవర్ణ కాంతిపుంజం ఉంటుందని తెలుస్తోంది అది మనిషి యొక్క శరీరా మానసిక స్థితులను బట్టి మారుతూ ఉంటుంది పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఈ ఓరా ఎంత శక్తివంతంగా కాంతివంతంగా మారుతుందని సమాచారం అలాగే చుట్టూ ఉన్న అత్యున్నత అనుకూల శక్తిని ఆకర్షించి మన శరీరంలోకి ఆ శక్తి ప్రవహింప చేస్తుందట.. అందుకే, పవిత్ర కార్యాచరణల్లోనూ, పూజాది క్రతువులు చేసేడప్పుడు, గుడికి వెళ్ళేడప్పుడు, ఆడవారినీ, మగవారినీ కూడా, పట్టు వస్త్రాలు ధరించమని, ఇలా ఉండటం మన ధర్మం అని చెప్తారు. అలాగే ఎలాంటి శుభకార్యమైన ఈ పట్టు వస్త్రాలు మంచినే చేస్తాయని తెలుస్తోంది.. అలాగే పట్టు చీరలను తయారు చేసినప్పుడు పట్టుపురుగులను వేడి నిలలో వేసి వాటి నుండి పట్టు దారాలు తీసి చీరలను తయారు చేస్తారు ఈ విషయం కొందరికి బాధ కలిగించే విషయం అయినప్పటికీ సృష్టిలోని పుట్టిన ప్రతి జీవికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అలాగే ఈ పట్టుపురుగు వెనుక కూడా ఉన్న అర్థం బహుశా ఇదేనేమో..