Politics ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసిన సభ పై బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు..
తాజాగా ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక సభను ఏర్పాటు చేసింది అయితే దీనిపై స్పందించిన హరీష్ రావు కామెంట్లు చేశారు… ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబుది భస్మాసుర హన్తం అని ఎద్దేవా చేశారు. అలాగే బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా మరిన్ని విమర్శలు చేశారు హరీష్ రావు రైతులు గురించి ఎన్టి రామారావు గురించి మాట్లాడే అర్హత అసలు చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది చంద్రబాబు కాదా అంటూ ఎద్దేవా చేశారు.. అలాగే హైదరాబాద్‌ను ఫ్రీజోన్ చేసి తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎవరూ పట్టించుకోరని అన్నారు.. అలాగే ఆయన ఏ ఎండకి.. ఆ గొడుగు పట్టే రకమని ఆరోపించారు. బాబు పాలనలోనే తెలంగాణ నిలువునా దోపిడీకి గురయిందన్నారు. తన వల్లనే వ్యాక్సిన్ వచ్చిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని వ్యాఖ్యానించారు… ఇంతా చేసే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు తెలంగాణలో అడుగు పెడతారంటూ ప్రశ్నించారు.. అలాగే తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని ఇప్పటికే అర్థం చేసుకున్నారు కాబట్టి రాష్ట్ర పరిస్థితి ఇలా ఉందంటూ చెప్పుకొచ్చారు