Crime ఇప్పటికే అక్రమ సంబంధాలు ఎందరో జీవితాల్ని నాశనం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ అనుమానం చివరికి పెనుబతమయ్యి ఒకరినొకరు చంపుకొని పరిస్థితులకు దారితీస్తుంది అయితే తాజాగా ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది..
భార్య మాత్రం సంబంధం పెట్టుకుందానే అనుమానంతో ఓ భర్త దారుణానికి ఓడుగట్టాడు అందరూ చూస్తుండగానే బస్సులోనే తన భార్య గొంతు కోసి హత్య చేశాడు.. గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన అందర్నీ షాక్ గురిచేసింది..
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ చోటా ఉదేపూర్‌లో మంగళవారం కదులుతున్న బస్సులో తన భార్యను గొంతు కోసి హత్య చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశామని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి కూడా సూరజ్ జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి గానే గుర్తించారు.. తన భార్యపై అనుమానంతో వ్యక్తి ఎలాగైనా ఆమెను చంపాలని దాదాపు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశాడు.. అప్పటికే పలుమార్లు ఫోన్లో వాళ్ళిద్దరూ గొడవ పడినట్టు చుట్టూ ఉన్న వారంతా తెలిపారు అయితే ఆమె బస్ కండక్టర్గా పనిచేస్తున్నట్టు సమాచారం ఎలాగైనా తన భార్యను చంపాలని ఈ గొడవలు అనంతరం ఆ వ్యక్తి నిర్ణయించుకొని వచ్చినట్టు తెలుస్తోంది అయితే ఆమె గొంతు కోసి చంపేసిన అనంతరం పోలీసులు వచ్చేంతవరకు శవంతో పాటు ఆ వ్యక్తి అక్కడే ఉండిపోయాడు.. చుట్టూ ఉన్న వారంతా ఈ సంఘటన చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు..