Crime కొన్ని రోజుల క్రితం మంచిర్యాల జిల్లాలో సంచలనాన్ని రేపింది మందమర్రి మండలం గుడిపల్లి సజీవ దహనం అయితే ఇప్పటికే ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు అయితే ఈ సమయంలో పలు విషయాలు బయటకు రావటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు..
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి లో కొందరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు దీనిపై పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే.. ఇంతటికీ కారణం వివాహేతర సంబంధం అని తెలుస్తోంది.. ఈ ఘటనలో రెండు కుటుంబాలకి చెందిన ఆరుగురు సజీవ దహనం అయ్యారు… ఆస్తి , సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం భర్త శాంతయ్యను ప్రియుడితో కలిసి భార్య సృజన హత్య చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో పోలీసులు శాంతయ్య భార్య సృజనతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో పలు విషయాలు బయటపడ్డాయి ఆహారంలో మత్తుమందు కలిపి వారంతా మత్తులోకి జారుకునే పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు తెలిసింది.. అయితే ఆస్తి , భూతగాదాలు , సింగరేణి వారసత్వ ఉద్యోగం కోసం తండ్రి శనిగారపు శాంతయ్యతో ఆరు ఏళ్లుగా శాంతయ్య కుమారులు రాజ్ కుమార్, దీపక్ కుమార్ లకు గొడవలు జరుగుతున్నాయి. శాంతయ్య మరో మహిళతో వివాహేతర సంబందం పెట్టుకోవడంతో అతని భార్య సృజన మరొకరితో సాన్నిహత్యం ఏర్పరుచుకుంది. భర్తను వదిలేసిన ఆమె.. ప్రియుడితో కలిసి శాంతయ్యను చంపించేందుకు మూడు నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. రెండు లక్షల సుఫారీ కూడా ఇవ్వటానికి ప్రయత్నించింది.. అదే నెల రోజుల క్రితం ఆర్కే ఫైవ్ బి గనీ వద్ద శాంతయ్య పై హత్యాయత్నం జరగక ఆ విషయం ఫలించక ఏకంగా సజీవ దహనానికి స్కెచ్ వేసి అందరినీ చంపించింది.