Crime బీహార్ లో ఇప్పటికే కల్తి మద్యంతో ఎందరో ప్రాణాలను కోల్పోయారు అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్న కల్తీ మద్యం విక్రయాలు మాత్రం ఆగటం లేదు తాజాగా కల్తీ మద్యం తాగి 65 మంది బలైపోయిన సంఘటన అందరిని షాక్కు గురి చేసింది..
బీహార్ లో సగం జిల్లాలో చాపరాలో మద్యంలో కల్తీ జరిగింది ఈ నేపథ్యంలో ఇది తాగిన వారందరూ తీర్మానారోగ్యానికి గురయ్యారు వీరిలో 65 మంది ఇప్పటివరకు చనిపోయారు మిగిలిన వాళ్లంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే వీరందరూ పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తోంది.. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు ఇందుకు కారకులైన చాప్రా స్టేషన్ హౌస్ ఆఫీసర్ రితేష్ మిశ్రా తో పాటు కాంస్టేబుల్ ను ఎస్పీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే..
అయితే ఈ సంఘటన బీహార్ అసెంబ్లీని కుదిపేసింది ఇప్పటికే రాష్ట్రంలో మద్యపానం కల్తీ లిక్కర్ నిషేధంలో ఉన్నప్పటికీ మళ్లీ విక్రయాలు ఎలా జరిగాయి అంటూ అసెంబ్లీని దద్దరిల్లేలా చేశారు బిజెపి ఎమ్మెల్యేలు దీనిపై ప్రభుత్వం ఇంకా సరైన చర్యలు తీసుకోవాల్సి ఉందని మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ముఖ్య మంత్రి వీరందరికీ క్షమాపణలు చెప్పాలని కూడా అన్నారు అయితే ఈ తీరుపై బీహార్ సీఎం నితీష్ కుమార్ అసహనం వ్యక్తం చేసి ఎలాంటి నష్టపరిహారం మృతులకు చెల్లించమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..