Health మారిపోతున్న జీవనశైలితో పాటు ఆరోగ్య అలవాట్లు ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి దీనివల్ల ప్రతి ఒక్కరిని వేధించే సమస్య నీరసం అయితే ఏ పని చేయాలన్నా కూడా చాలా చిరాకుగా నీరసంగా ఉండటం వల్ల అనారోగ్యం బారిన పడ్డామా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది అయితే ఈ చలికాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది అయితే రోజంతా ఉత్సాహంగా ఉండాలి అంటే మనం నిద్రలేస్తూనే కొన్ని పద్ధతుల్ని పాటించాలని తెలుస్తోంది..
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజున కచ్చితంగా ఉత్సాహంగా మొదలు పెట్టాలి అలాగే ఉదయాన్నే తొందరగా నిద్ర లేవడం వల్ల ఎలాంటి హడావిడి ఉండకుండా సమయానికి అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు.. ముఖ్యంగా నిద్రలేస్తూనే కొందరికి ఫోన్ చూసే అలవాటు ఉంటుంది ఇలా కాకుండా ఫోన్లో కొంచెం దూరం పెట్టి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడడం అలవాటు చేసుకోవాలి. అలాగే వీలైతే ఓ నాలుగు అడుగులు వేసి వాకింగ్ జాగింగ్ లాంటివి చేసే నలుగురుతో కాసేపు కాలక్షేపం చేసి రావడం వల్ల రోజు చాలా ప్రశాంతంగా మొదలవుతుంది అలాగే తీసుకునే ఆహార పదార్థాలను కూడా పోషకాహారం ఉన్నవి తీసుకోవాలి అలాగే ఎలాంటి పరిస్థితుల్లో కూడా అల్పాహారాన్ని దాటివేయకూడదు.. అలాగే వీలైతే యోగ ధ్యానం లాంటివి చేయడం కూడా అలవాటు చేసుకోవాలి రోజంతా ఎన్ని పనులు ఉన్నా కుటుంబానికి మాత్రం కావలసినంత సమయాన్ని కేటాయించడం వల్ల ఉన్న ఒత్తిడి మొత్తం పూర్తయిపోతుంది అలాగే పని చేసే సమయంలో కూడా పూర్తి ఏకాగ్రతతో పనిని పూర్తి చేసుకొని ఉండటం వల్ల ఎలాంటి చిరాకులు దరి చేరవు అని తెలుస్తోంది