Crime రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన పదేళ్లు పూర్తి చేసుకుంది అయితే ఈ సంఘటన అనంతరం దేశంలో ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ మహిళలకు ఎంతవరకు రక్షణ ఉన్నది అనే విషయం మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది.. నిర్భయ ఘటనకు మరో రెండు రోజుల్లో 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ విషయం మరొకసారి చర్చనీయాంశంగా మారింది..
దాదాపు పదివేల క్రితం దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఓ అమ్మాయి పై ఢిల్లీ నడిరోడ్డు పైన సామూహిక అత్యాచారం జరిగింది అయితే ఆమెను నిర్భయగా పేరు ఉంచి తర్వాత ఆమె పేరుతో పలు చట్టాలను తీసుకువచ్చింది.. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది పార్లమెంటును సైతం కుదిపేసిన ఈ ఘటన అనంతరం నిర్భయ పేరుతో ఎన్నో చట్టాలు వచ్చాయి అయితే ఇందులో ఆ అమ్మాయి చనిపోవడంతో తర్వాత ఆ దోషులకు శిక్ష పడింది అయితే ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఆడపిల్లలకు రక్షణ ఎంతవరకు ఉంది అనే విషయం మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది దేశంలో ఇప్పటికీ మహిళలపై దాడులు హత్యాచారాలు ఎప్పటిలాగే జరుగుతూ ఉండగా అదేలో అయినా పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.. అయితే ఇప్పటికే ఇలాంటి వాటితో బలైపోయిన పిల్లల తల్లిదండ్రులు సైతం ఈరోజుకి ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదు అంటూ వాపోతున్నారు.. అలాగే ప్రతినిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గర అత్యాచారం జరుగుతూనే ఉంది 2021 లోనే ఢిల్లీలో ఉన్న మహిళలపై 13 వేలకు పైగా నేరాలు జరిగాయని తెలుస్తోంది ముందు ఏడాదితో పోలిస్తే ఇది 40% ఎక్కువగా ఉన్నట్టు సమాచారం