Crime నల్గొంగ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న ఓ కారు డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది దీంతో కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ఇద్దరు మృతి చెందారు.. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకు సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు..
రోజు ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటున్నాయి జాగ్రత్తగా వెళ్లాలని ఎంతగా చెబుతున్నా ఏదో ఒక సమయంలో చిన్న అజాగ్రత్త ప్రాణాలను బలి తీసుకుంటుంది ముఖ్యంగా జాతీయ రహదారులపై ఈ ప్రమాదాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటున్నాయి కుటుంబ సమేతంగా వెళుతున్న వారు కూడా ఏదో ఒక క్షణం లో అజాగ్రత్త పాటించడంతో ప్రాణాలు పోతున్నాయి ఇలాంటి ఓ సంఘటనే తాజాగా నల్గొండ జిల్లా సమీపంలో చోటుచేసుకుంది..
హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న ఓ కారు అకస్మాత్తుగా డివైడర్ను ఢీకొంది నల్గొండ జిల్లా సమీపంలో కేతేపల్లి మండలం ఇనుపాయల స్టేజి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది ప్రమాదం సమయంలో కారులో ఐదు వ్యక్తులు ఉన్నట్టు సమాచారం వీరిలో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారు తీవ్ర గాయాల పాలయ్యారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకు సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు… వెంటనే నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.