Health రోగ నిరోధక శక్తి పెంచడంలో ముందు వరుసలో ఉంటుంది పసుపు ఎన్నో ఏళ్లుగా భారతీయ వంటకాల్లో చేరిపోయింది అయితే ఎప్పుడు పసుపు కోసం మంచిగానే చెబుతూ ఉంటారు వైద్య నిపుణులు అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం పసుపును తీసుకోవడం అసలు మంచిది కాదు అని తెలుస్తుంది..
రోజు వంటకాల్లో ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అలాగే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది ముఖ్యంగా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి అందుకే ఏ మాత్రం చిన్న దెబ్బ తగిలిన వెంటనే పసుపును పెడితే తగ్గిపోతుంది అంటారు అలాగే దగ్గు జలుబు వంటి వ్యాధులు ఉన్నప్పుడు పాలలో కొంచెం పసుపు వేసుకొని తాగితే ఆ సమస్య వెంటనే మటుమాయమైపోతుంది ఇన్ని సుగుణాలు ఉన్న పాలుని కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు.. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు పసుపు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోజు మెడిసిన్ తీసుకుంటున్న షుగర్ పేషెంట్స్ పసుపును ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది అలాగే పిత్తాశయ సమస్యలు ఉన్నవారు పసుపును తీసుకోవడం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది పసుపు పైత్య రసాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసి ఆ సమస్యను మరింత కఠినంగా మారుస్తుందని తెలుస్తోంది… అలాగే ఎవరికైతే శరీరంలో ఐరన్ లోపం ఉంటుందో అలాంటి వారు పసుపు దూరంగా ఉండాలి.. పసుపులో ఉండే.. ఔషద గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి..