Health ఉప్పులేని కూరల్ని అసలు ఊహించుకోలేము ఏం లేకపోయినా ఉప్పు వేయకపోతే ఆరుచి మారిపోతుంది..
అలాగే రోజు తినే కూరల్లో ఉప్పు కాస్త తక్కువ అయితేనే ఏమాత్రం రుచి ఉండదు.. అయితే ఉప్పు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్ధాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది..
ఉప్పు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు సక్రమంగా అందుతాయి అదే ఇప్పుడు ఏమాత్రం ఎక్కువైనా పలు అనారోగ్య సమస్యలకు తీస్తుంది.. శరీరాన్ని కావాల్సిన పోషకాల్లో సోడియం కూడా ఒకటనే మాట నిజమే.. ఇది శరీరంలో ఉండే ద్రపదార్థాలన్నిటిని సమతుల్యం చేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే కండరాలు, నాడీ కణాలు సక్రమంగా పనిచేసేందుకు శరీరానికి కావాల్సిన పోషకాలు అందేందుకు ఉప్పు ఎంతో అవసరం..
ఉప్పు ఎక్కువ అవ్వటం వల్ల రక్తపోటు సమస్యను ఎదుర్కొంటూ గుండెపోటు బారిన పడుతున్నారనీ తెలుస్తోంది ముఖ్యంగా భారతదేశంలో ఉప్పు వాడకం ఎక్కువైనా కచ్చితంగా గుండె జబ్బులు వస్తున్నాయని తేలింది.. కొన్ని దశాబ్దాల క్రితం వరకు గుండెదబ్బులు అంటే కేవలం వయసు మళ్ళిన వాళ్లకు మాత్రమే వచ్చేవిగా అనుకునేవారు కానీ ఇప్పుడు 30.. 40 ఏళ్లలో ఉన్న వారికి కూడా గుండెపోటు సమస్య వస్తోంది.. అలాగే ఉప్పు ఎక్కువగా తినే వారికి బీపీ సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది విపరీతంగా బీపీ పెరిగిపోవడం, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు రావడం, కిడ్నీలో రాళ్లు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటున్నాయి.. అలాగే ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది.. తర్వాత శరీరంలో పల అవయవాలు చెడిపోయే అవకాశం ఉంది అందుకే రోజు వారి ఆహారంలో ఉప్పును మితంగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..