Health కొన్ని రకాల కూరగాయల గురించి ఎలా తినాలా అని కొంత ఆలోచనలో పడుతూ ఉంటాము. వాటిని పచ్చిగా తింటే ఆరోగ్యమా లేదా… వండి తింటేనే ఆరోగ్యానికి మంచిదా వీటిలో ఏది నిజం.
నిజానికి కూరగాయలు మనము పచ్చిగానే తింటే ఆరోగ్యమని కొన్ని పుస్తకాలలో మరియు యోగాలో చెపుతూ ఉంటారు. అయితే కొన్ని పచ్చిగా తినాల్సిన కూరగాయలు ఉన్నాయి. ఉడికించి తినాల్సినవి ఉన్నాయి . ఆ రెండిటి మధ్య తేడాలను తెలుసుకుందాం.
వీటిని పచ్చిగానే తినాలి
బీట్ రూట్స్: బీట్ రూట్ల్ లో మెదడుకు గుండెకు అవసరమైన ఫోలేట్ ఉంటుంది. గర్భిణీల్లో పిండం ఆరోగ్యమైన పెరుగుదలకు ఫోలేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే బీట్రూట్ ను ఉడికిస్తే ఈ కాంపౌండ్ నశిస్తుంది. కాబట్టి రూట్ నో సాధ్యమైనంత ఎక్కువగా జ్యూస్ రూపంలో తీసుకోవడమే మేలు.
ఉల్లిపాయలు: ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నప్పుడే వాటిలో ఎక్కువ శాతం అలిసిన్ అనే ఫైటో న్యూట్రియెంట్ ఉంటుంది. ఇది ఆస్ట్రియో ఆర్థరైటిస్ రాకుండా అరికడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు పచ్చి ఉల్లిపాయలు తింటూ ఉండాలి.
వీటిని వండాల్సిందే!
టమోటా: టమోటాల్లో ఆంటీ ఆక్సిడెంట్ ఫైటో కెమికల్ లైకోఫైన్ ఉంటుంది. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా కాపాడే ఈ పోషక పదార్థాన్ని శరీరం చక్కగా సూచించుకోవాలంటే టమోటా లను ఉడికించి తినాల్సిందే!
పుట్టగొడుగులు: వీటిలో శక్తివంతమైన పాలీ శాఖ రైట్స్ ఉంటాయి. వాటితో పాటే స్వల్ప పరిమాణంలో సీన్స్ కూడా ఉంటాయి. ఈ టాక్సిన్స్ నో హరించి పాలి శాఖ రైట్స్ శరీరానికి వంట బట్టాలంటే పుట్టగొడుగులు ఉడికించి తినాలి.
ఆస్పరాగస్: క్యాన్సర్ తో పోరాడే ఫెర్యులిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ అన్ని పూర్తిగా పొందాలంటే ఆస్పరాగస్ ని ఉడికించి తినాలి.