Health చేతి గోళ్లు మారే రంగును బట్టి మనిషి ఆరోగ్యం పరిస్థితిని కచ్చితంగా చెప్పవచ్చని తాజా అధ్యయనాల్లో తెలిసింది..
గోళ్ల రంగుని చూసి మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయవచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. గోళ్ల రంగు మారటం వాటి రూపంలో వచ్చే మార్పులు అనేక అనారోగ్య సమస్యలకు సంకేతాలని తెలుపుతున్నారు.
గోళ్ళ రంగులో ఎలాంటి మార్పు వచ్చిన అజాగ్రత్త వహించకుండా ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలని తెలుస్తోంది.. గోళ్ల రంగు సాధారణంగా లేత గులాబీ రంగులో ఉంటుంది అయితే ఇలా కాకుండా రోజురోజుకీ తెల్లగా మారుతూ ఉంటే రక్తహీనత పోషకాహార లోపం ఉన్నాయేమో పరీక్షించుకోవాలి.. అలాగే గోల్డ్ తెల్లగా ఉండి అంచులు మాత్రం ముదురు రంగులో మారుతుంటే కాలేయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాబోతున్నయని సంకేతం.. అలాగే గుండె సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఈ విధంగా నీలిరంగులోకి మారుతాయి.. అలాగే గోళ్లు పసుపు రంగులోకి మారితే ఇన్ఫెక్షన్ సోకినట్టు సంకేతం.. అయితే ఆ ఇన్ఫెక్షన్ పెరుగుతున్న కొలది గోళ్లు మరీ మందంగా మారి విరిగిపోతూ ఉంటాయి.. అయితే ఇలా జరగడం అనేది కొన్ని సందర్భాల్లో థైరాయిడ్, మధుమేహం, సొరియాసిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది..
కొన్నిసార్లు గోళ్లు నీలి రంగులోకి మారి ఇబ్బందిగా ఉంటుంది.. జరుగుతుంటే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందట్లేదు ఏమో తెలుసుకోవాలి ఇది తర్వాత ఉపితిత్తుల సమస్యకు కూడా దారి తీయవచ్చు.. అలాగే గోళ్ళ పైన చర్మం గుంటలు గుంటలుగా పడినట్టు మారితే సోరియాసిస్ లేదా కీళ్ళ కు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి..మరి కొన్నిసార్లు నెయిల్స్ బాగా పొడిబారి పెలుసుగా మారి చిట్లుతుంటాయి. ఈ సమస్య తరుచుగా తలెత్తితే అది థైరాయిడ్ వ్యాధికి సంకేతమని అనుమానించాలి