Health శృంగారం అంటే ఏదో తప్పుడు పదంలా అందరూ చూస్తూ ఉంటారు.. అయితే దీనికోసం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.. ఆనందం, సంతోషంతో పాటు శృంగారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఓ చూద్దాం..
నిత్య జీవితంలో శృంగారంను ఒక భాగంగా చూడాలి.. ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చురుకైన శృంగార జీవనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట. ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు అనగానే వ్యాయామం, ధ్యానం వంటివే గుర్తుకొస్తాయి. కానీ ఇందుకు శృంగారం చక్కని పరిష్కారం..
గుండెకు శృంగారం ఎంతో మంచిది.. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే సగటున నెలకు ఒకసారి, అంతకన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనేవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే రోజు వ్యాయామం చేయకుండా బద్దకించే వారికి శృంగారం చక్కని పరిష్కారం..
అలాగే నిత్యం శృంగారం చేసే వారిలో జ్ఞాపకశక్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది.. మెదడున్న సక్రమంగా ఉంచడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాగే నిద్రలేమితో బాధపడే వారికి.. మానసిక ప్రశాంతతకు శృంగారం చక్కని పరిష్కారం.. అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు నిత్యం శృంగారం చేయడం వల్ల అనేక రకాల అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు అని తెలుస్తోంది.. అలాగే రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండవచ్చని చెబుతున్నారు నిపుణులు..