Health Tips : చలి కాలంలో ఎక్కువగా వేధించే సమస్యలలో కాళ్ల పగుళ్లు కూడా ఒకటి. చల్లని గాలి కారణంగా త్వరగా చర్మం డ్రైగా మారుతుంది. మరికొందరిలో డయాబెటిస్, థైరాయిడ్ సమస్య ఉన్నా… కాళ్ల పగుళ్లు వస్తూ ఉంటాయి. ఈ పగుళ్లు పాదాల అందాన్ని పోగొట్టడమే కాకుండా కొందరిలో లోతుగా పగుళ్లు ఏర్పడి రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. పాదాల పగుళ్లను నివారించడానికి కొన్ని టిప్స్ మీకోసం ప్రత్యేకంగా…
కొబ్బరి నూనె : కొబ్బరి నూనె బెస్ట్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌లా పని చేస్తుంది. గోరువెచ్చని నీటితో కాళ్లు శుభ్రం చేసుకుని, వాటిని బాగా ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని కొబ్బరినూనెతో కాళ్లపై మసాజ్ చేయండి. ఆ తర్వాత కాటన్ సాక్స్ వేసుకుని పడుకోండి. ఇలా రోజు చేస్తే కాళ్ళ పగుళ్లు తగ్గుతాయి.
వెన్న : వెన్న పాదాల పగుళ్లను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పాదాలను శుభ్రం చేసుకుని ఆరిన తర్వాత వెన్నతో మసాజ్ చేయండి. ఆ తర్వాత కాటన్ సాక్స్ వేసుకోండి. రెండు రోజుల్లోనే కాళ్ళ పగుళ్లు తగ్గుతాయి.
తేనె : తేనె మంచి యాంటీసెప్టిక్‌గా పని చేస్తుంది. తేనెలో నిమ్మరసం కలిపి పాదాలకు రాస్తే మంచిగా పని చేస్తుంది. అలాగే టబ్‌లో గోరువెచ్చని నీరు తీసుకుని, పాదాలు మునిగేలా ఉంచండి. దానిలో, రెండు చెంచాల తేనె వేయండి. పది నిమిషాలయ్యాక పగిలిన ప్రాంతాన్ని మృదువుగా రుద్దాలి. అదే విధంగా గోరు వెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం పొడిబట్టతో తడి లేకుండా తుడవాలి. దీంతో కాళ్ళ పగుళ్లు తగ్గుతాయి.