Health సాధారణంగా యూరిన్ లేత పసుపు రంగులో ఉంటుంది ఇది ఎలాంటి దుర్వాసన లేకుండా ఉంటుంది అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రం యూరిన్ విపరీతమైన దుర్వాసన వస్తుందని ఇలాంటి సమయంలో తప్పకుండా వైద్యుణ్ని సంప్రదించాలని తెలుస్తోంది..
శరీరం డిహైడ్రేట్ అయినప్పుడు యూరిన్ ఎక్కువగా దుర్వాసన వస్తుంది కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేసి అక్కర్లేని మరణాలను బయటకు పంపిస్తూ ఉంటాయి ఈ ప్రక్రియలో కొన్నిసార్లు యూరిన్ రంగు మారుతూ ఉంటుంది పసుపు ఎరుపు గోధుమ రంగుల్లో కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు యూరిన్ రంగు మారటం మరి ఎక్కువగా దుర్వాసన రావడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు..
తగినంత నీరు తాగితే యూరిన్ లేత పసుపురంగులో ఉంటుంది. ఇది మనం హెల్తీగా ఉన్నామని అర్థం. యూరిన్ ముదురు గోధుమరంగు ఉన్నా, దుర్వాసన వస్తుంటే శరీరం డీహైడ్రేషన్ అయినట్లు అర్థం. అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ సంబంధించి.. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, డయాబెటిస్, లివర్ ఇన్ఫెక్షన్స్, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కావచ్చు.. ఉదయం పూట లేవగానే కొందరికి యూరిన్ ముదురు పసుపు రంగులో.. కొంచెం దుర్వాసన వస్తూ కనిపిస్తుంది. ఇది తీవ్రమైన సమస్యగా పరిగణించక్కర్లేదు కానీ ప్రతినిత్యం ఇలాగే జరుగుతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి.. యూరిన్ కు వెళ్ళినప్పుడు మంటగా అనిపించడం రక్తం రావడం దుర్వాసన రావడం వంటివి కనిపించిన తప్పనిసరిగా వైద్యుడ్ని సంప్రదించాలి ఇవి కచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్కు దారి తీసే అవకాశం ఉంది..