Amitabh Bachchan : భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి బాలీవుడ్ లో స్టార్ గా మెగాస్టార్ గా ఎదిగారు అమితాబ్. తన నటనతో అందరి చేత లక్షలాది మందిని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నారు బిగ్ బి. యావత్ దేశం గర్వించే నటుడుగా ఎదిగిన బిగ్‌బి జీవితం ఎంతో మందికి ఆదర్శం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 80 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు అమితాబ్. అయితే బిగ్ బి సినీ కెరీర్ ప్రారంభించడానికి ముందు చాలా కష్టాలు పడిన విషయం తెలిసిందే. ఆయన గొంతు, హైట్ కారణంగా సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి కొంతమంది నిరాకరించారని గతంలో పలుమార్లు అమితాబ్ చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి తన జీవితంలో ఎదురైనా సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు అమితాబ్. కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో గతంలో తన ఫ్యామిలీ గురించి, వ్యక్తిగత విషయాలను గురించి చాలా తెలిపారు. తాజాగా ఎపిసోడ్ లో బిగ్ బి మాట్లాడుతూ… తాను సినిమాల్లోకి రాకముందు కడుపునిండా అన్నం తినడం కోసం ఎంతో కష్టపడ్డాను అంటూ తన కష్టాలు గురించి చెప్పుకొచ్చారు.
అలానే సినిమాల్లోకి రావడానికి ముందు కలకత్తాలో పని చేసేవాడినని ఆ సమయంలో తినడానికి సరైన తిండికూడా దొరికేది కాదని అన్నారు. ఆ సమయంలో నెలకు 300 రూపాయలు మాత్రమే జీతం వచ్చేదని… దాంతో రోజు తిండికి సరిపోక పానీ పూరి తిని కడుపు నింపుకునేవాడినని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.