Chandrababu : మంగళగిరి లోని తెదేపా కేంద్ర కార్యాలయంలో లోని టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో చంద్రబాబు కొత్త కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ సంధర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘ఇదేం కర్మ’ పేరుతో టీడీపీ తమ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి దారుణాలు చూడలేదని, అందుకే ఈ కార్యక్రమానికి ఇదేం కర్మ అని పేరు ఖరారు చేశామని చెప్పారు.
ఒకే రాజధాని కావాలని గతంలో చెప్పారని, ఇప్పుడు మాట మార్చారని అన్నారు. కొందరు పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. రేపు అనే ఒక రోజు ఉంటుందని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. వైసీపీ పాలనలో మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని చంద్రబాబు నాయుడు అన్నారు. అలానే వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళే నిమిత్తం ఆ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
రాబోయే రోజుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకుంటారని… 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారని సమాచారం అందుతుంది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నామని, లేనప్పుడు కూడా బాధ్యతగా ఉంటున్నామని అన్నారు. తాము ప్రాంతీయ భావాలతోనే కాకుండా జాతీయ భావాలతోనూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రజల కోసం తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఈ సంధర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార చిత్రాలను రిలీజ్ చేశారు.