Health Tips : చలికాలం వచ్చిందంటే చాలు చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎండాకాలం లాగా చెమటలు పట్టవు కాబట్టి. కానీ చలికాలం మనలో కొందరి చర్మానికి అంత మంచిది కాదు. సాధారణంగా కార్తీకమాసం వచ్చిందంటే కొందరికి ఆనందం. మరికొందరికి బాధగా ఉంటుంది. ఈ చలికాలంలో చాలామంది శరీరము పొడిబారిపోవడం పగుళ్లు రావడం అనేది జరుగుతుంది. దీనివలన చర్మం పైన తెల్లని పొడి లాగా కనపడుతూ ఉంటుంది.
మరికొందరిలో వయసు పైబడిన వారి చర్మం లాగా ముడతలు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన చర్మాన్ని మనం చూసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇటువంటి సమస్యలు అన్నిటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చెక్ పెట్టవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
▪️ ముఖ్యంగా చర్మం నిగారింపుగా పొడిబారకుండా కనిపించాలి అంటే పెరుగుని, పాలని మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పెరుగు మరియు పాలలో చర్మ వ్యవస్థను కాపాడేటువంటి శక్తిని కలిగి ఉంటాయి.
▪️చలికాలంలో మరీ వేడిగా ఉండే నీళ్లతో కాకుండా గోరువెచ్చగా ఉండే నీటితో స్నానం చేస్తే మంచిది.
▪️శరీరము పొడి బారింది అనిపించినప్పుడు లేదా పొడిబారిన చోట వెన్నని రాసుకుంటే చర్మము మృదువుగా మరియు నిగారింపుగా మారుతుంది.
▪️చలికాలంలో ఎక్సర్సైజ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది దానివల్ల మన శరీరానికి వేడి అనేది పుడుతుంది. అంతేకాదు దానివలన మన హార్ట్ బీట్ పెరుగుతుంది. దీనివలన బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరుగుతుంది. ▪️చలికాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మన చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చలికాలం ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉంటుంది.