Bhakthi జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అదృష్టం కలిసి వచ్చేందుకు కొన్ని సంకేతాలు కచ్చితంగా ఉంటాయని చెబుతూ ఉంటారు ఆ సంకేతాలు ఉన్న ఆడవారైనా మగవారికైనా అదృష్టం దానంతట అదే వస్తుందని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది అయితే కొన్ని చోట్ల పుట్టుమచ్చ వున్న ఆడవారు ఎక్కడికి వెళ్ళినా వారి వెంట అదృష్టం తప్పకుండా ఉంటుందని చెబుతుంది జ్యోతిష్యం అది ఏంటో తెలుసుకుందాం..
సాధారణంగా పుట్టుమచ్చలు అదృష్టానికి సంకేతాలు అంటారు అయితే కొన్ని చోట్ల ఉండే పుట్టుమచ్చలు అనారోగ్యానికి కారణాలు అయితే మరి కొన్ని చోట్ల ఉండే పుట్టుమచ్చలు మాత్రం అదృష్టానికి ధనవృద్దికి సంకేతాలుగా చెబుతారు.. అయితే ఈ పుట్టుమచ్చలు ఒంటిపై ఒక్కో ప్రదేశంలో ఒక్కో తీరులో అదృష్ట, దురదృష్టాలను తీసుకువస్తాయి.. ఇందులో ముఖ్యంగా ఆడవారికి ఇది పూర్తిగా వర్తిస్తుంది.. అయితే ఏ చోట పుట్టుమచ్చలు ఉంటే ఆ ఆడవారికి అదృష్టం కలిసి వస్తుందో ఒకసారి తెలుసుకుందాం..
ఆడవారికి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే అదృష్టం మారి వెంటే ఉంటుందంట అయితే ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న ఆడవారికి కోపం కూడా ఎక్కువనే ఉంటారు కానీ వీరు పుట్టింట్లో ఉన్న అత్తవారింట్లో ఉన్న వారి వెంట అదృష్టం నడుచుకుంటూ వస్తుందని మాత్రం జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.. అలాగే ఉదర భాగంలో పుట్టుమచ్చ ఉన్న ఆడవారికి కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది అని తెలుస్తోంది.. అలాగే మెడ భాగంలో పుట్టుమచ్చ ఉన్న ఆడవారు ఎక్కడ ఉన్నా అక్కడ లక్ష్మీదేవి నిలుస్తుందని అలాగే ఇలాంటి వారికి బంగారం కూడా ఎక్కువగా చేకూరుతుందని తెలుస్తోంది అలాగే కంట్లో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది.. అలాగే అరికాలు, అరిచేతుల్లో పుట్టుమచ్చలు ఉన్నా కూడా విశేష ధన ప్రాప్తి కలిగి సిరి సంపదలు చేకూరుతుందని తెలుస్తోంది..