విద్యాశాఖలో 134 పోస్టులు ★ భర్తీకి ఆర్థికశాఖ అనుమతి
రాష్ట్రంలో కొలువుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. తాజాగా విద్యాశాఖలో 134 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 91 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందులో 80 వేల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిన భర్తీ చేస్తున్నారు. కాగా, ఈ పోస్టుల భర్తీపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘మేం మాటలు చెప్పం. చేతల్లో చూపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం’ అని ట్వీట్ చేశారు.