Bhakthi భారతదేశమంటేనే దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది ఈ దేశంలో ఉన్న దేవాలయాలు మరే దేశంలోని ఉండవు అయితే మన దేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు ఏటా కోట్ల రూపాయలు హుండీల ద్వారా పొందుతున్నాయి అయితే ఇక్కడ ఉన్న వాటిలో అత్యంత సంపన్న దేవాలయాలు ఏంటో ఒకసారి చూద్దాం..
భారతదేశంలో ఎన్నో సంపన్న దేవాలయాలు ఉన్నాయి ఇవన్నీ ఏటా కోట్ల రూపాయలను భక్తుల ద్వారా పొందుతున్నాయి అయితే అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం కొన్ని ఏళ్ల క్రితం ఈ ఆలయం నుండి కోట్ల రూపాయలు సంపద బయటపడిన సంగతి తెలిసిందే.. అయితే వీటి విలువ లక్ష కోట్లు దాటే ఉంటుంది.. అలాగే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.. అయితే తిరుమలకు ఏటా 650 కోట్లు రూపాయలు వరకు ఆదాయం వస్తుందని అంచనా..
అలాగే మహారాష్ట్రలో ఉన్న శిరిడి సాయిబాబా ఆలయం కూడా దేశంలో సంపన్న ఆలయాలలో ఒకటిగా చెప్పవచ్చు.. ఈ ఆలయానికి ఏట 360 కోట్లు రూపాయలు దాటే సంపాదన ఉంటుందని చెబుతున్నారు.. అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వైష్ణవి దేవి ఆలయం కూడా కోట్ల రూపాయల సంపదను కలిగి ఉంది.. ఏటా ఈ ఆలయానికి 500 కోట్ల రూపాయలు దాటే వస్తుందని చెబుతున్నారు..