Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో దూసుకుపోతూ సౌత్ ఇండియా లో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు. కాగా ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తెలుగుతో పాటు హిందీ లోనే భారీ హిట్ ను ఈ మూవీ సొంతం చేసుకుంది. కాగా ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బన్నీ బిజీగా ఉన్నారు. అయితే ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అభిమానులకు సాయం అందించడంలో మాత్రం ఎప్పుడూ తాను ముందుంటాడని మరోసారి నిరూపించుకున్నాడు.
ఇటీవల కేరళలో విద్యార్థికి ఉన్నత చదువుకు సాయం చేసిన బన్నీ… తాజాగా తన వద్ద పని చేస్తున్న కారు డ్రైవర్ కు ఏకంగా రూ. 15 లక్షలు అందించారు. ఈ మేరకు స్వయంగా డ్రైవర్ ఇంటికెళ్లి బన్నీ చెక్కు అందజేశారట. దీంతో ఈ వార్త తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు ఆయనను పొగుడుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… వరంగల్ కు చెందిన మహిపాల్ అల్లు అర్జున్ వద్ద పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల అతను బోరబండలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఆ ఇంటి నిర్మాణానికి తన వంతు సాయంగా బన్నీ రూ. 15 లక్షలు అందజేసి మంచి మనసును చాటుకున్నారు. అలానే ఇటీవల కేరళకు చెందిన ఓ విద్యార్థిని చదువు పూర్తిచేయడానికి బన్నీ ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు అలెప్పీ జిల్లా కలెక్టర్ వీ.ఆర్ కృష్ణ తేజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా బన్నీని తెగ అభినందిస్తున్నారు.