Allu Aravind : తెలుగు సినీ పరిశ్రమలో ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా అల్లు రామలింగయ్య మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి అల్లు అరవింద్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించిన అల్లు అరవింద్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే అల్లు అరవింద్ కు నలుగురు కుమారులు అనే విషయం.
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ (బాబీ), రెండవ కుమారుడు అల్లు అర్జున్, అల్లు అర్జున్ తర్వాత అల్లు శిరీష్ గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ అల్లు వెంకట్, అల్లు అర్జున్ కి మధ్య అల్లు అరవింద్ కు రాజేష్ అనే కొడుకు ఉండేవారు. రాజేష్ ఏడు సంవత్సరాల వయసులో ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటికీ అల్లు శిరిష్ ఇంకా పుట్టలేదట.
ఇలా అల్లు అరవింద్ కి నలుగురు కుమారులు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శిరిష్ వెల్లడించారు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ రీసెంట్ గా వరుణ్ తేజ్ గనీ సినిమాతో నిర్మాతగా మారాడు. ఇలా ఏడు సంవత్సరాల కొడుకు మృతి చెందడంతో అల్లుఅరవింద్ దంపతులకు తీరని కడుపుకోత మిగిలింది. ఇటీవలే కాంతార సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేసి మంచి లాభాలను సంపాదించారు అల్లు అరవింద్.