Ginna movie: ఇటీవల విడుదల అయిన మంచు విష్ణు నటించిన చిత్రం పేరే జిన్నా. దీనికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ లు హీరోయిన్లు గా అలరించారు. ఈ చిత్రం గత నెల 21 న విడుదల అయ్యింది. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకే సారి విడుదల అయిన ఈ చిత్రం అనుకున్న కలెక్షన్ లను సాధించకపోయినా గానీ విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది.
కలెక్షన్ ల విషయానికి వస్తే.. ఈ సినిమా విడుదల అయిన అదే రోజే మరో నాలుగు సినిమాలు కూడా విడుదల అయ్యాయి. దీంతో ‘జిన్నా’కు ఆశించిన కలెక్షన్స్ రాలేకపోయాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం మంచు ఫ్యామిలీకి మాత్రం మంచి లాభాలను అందించింది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీంతో మంచు ఫ్యామిలీ ఈ సినిమా మీద పెట్టిన మొత్తం ఈ విధంగా వసూలు చేసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు.
గతంలో మంచు విష్ణు నటించిన కొన్ని సినిమాలు హిందీ భాషలో డబ్ అయ్యాయి. అదే సమయంలో కొంతమేర అక్కడి ప్రేక్షకులను అలరించాయి. దీంతో జిన్నా హిందీ డబ్బింగ్ రైట్స్ ఈ మొత్తంలో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు హింది సినిమా పరిశ్రమకు బాగా తెలిసి ఉండడం కారణంగా ఈ సినిమా పది కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్సును దక్కించుకున్నట్లు సమాచారం.