Devotional News : తాబేలును కేవలం ఒక జంతువు గానే కాకుండా హిందూ పురాణాల ప్రకారం … కూర్మావతారం లోని విష్ణుమూర్తి ప్రతీకగా భావించి పూజించడం చేస్తుంటారు. శ్రీ మహా విష్ణువు కూర్మావతారంలో వచ్చి తన అద్భుతమైన మహిమలను చూపాడని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అందుకే తాబేలుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. శాస్త్రం ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయని, సంపద పెరుగుతుందని నమ్ముతారు. అయితే తాబేలును గానీ.. తాబేలు బొమ్మలను ఇంట్లో ఉంచుకోవాలనుకునే వారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరగాలంటే అందుకు సరైన రోజు, సరైన దిశలో తాబేలును ఉంచాలి. తాబేలు నీటిలో నివసించే జంతువు కాబట్టి, అది ఉండే పాత్రను నీటి దిశలోనే ఉంచాలి అంటే ఈశాన్య దిశలో ఉంచాలి. అలాగే ఇంట్లో తాబేలును ఉంచేటప్పుడు దాని నోరు లోపల ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. తాబేలు నుంచి నోరు బయటకు వచ్చిన ముఖాన్ని ఇంట్లో ఎప్పటికీ ఉంచుకోవద్దు. ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో గొడవలు, అశాంతి, ఆర్థిక పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
అలానే మీ ఇంట్లో సుఖశాంతులు కావాలంటే తాబేలును మీరు నివసించే గదిలో తూర్పు వైపున ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే లోహపు తాబేలును ఎల్లప్పుడూ నీటిలో ఉంచాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. వీటితో పాటు కొన్ని రంగురాళ్లను కూడా కలపొచ్చు. దీని వల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగవుతుంది.