Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సెలబ్రెటీలు కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రియా, రాశిఖన్నా, సుస్మిత కొణిదెల, కియారా అద్వానీ వంటి పలువురు ప్రముఖులు స్పందిస్తూ… ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందరి దృష్టి మాత్రం అక్కినేని కుటుంబం పైనే ఉంది. గత ఏడాది సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. కాగా దీనిపై చైతన్య స్పందిస్తాడా లేదా అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సమంత అనారోగ్యంపై అక్కినేని యంగ్ హీరో అఖిల్ స్పందించారు. అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్ అంటూ అఖిల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. చైతన్య కూడా స్పందించాలి అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి చూడాలి నాగచైతన్య రియాక్ట్ అవుతాడో లేదో. కొద్ది రోజులుగా సామ్ అరుదైన చర్మ సమస్యతో బాధపడుతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి.
సామ్ అనారోగ్యం గురించి వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే తాను మైసోటిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు ప్రకటించి తన అనారోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది సామ్. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. అలాగే ఆమె నటించిన యశోద చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన యశోద సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తుంది.