Nithya Menon : తెలుగు చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో నిత్యా మీనన్ కూడా ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకోవడం, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడం, కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేయడం లాంటివి ఆమె వ్యక్తిత్వాన్ని తెలుపుతూ ఉంటాయి. ఇటీవల భీమ్లా నాయక్, తిరు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ… ఇప్పుడు తన అభిమానులందరిని అయోమయం లో పడేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ మేరకు నిత్యమీనన్ తన ఇంస్టాగ్రామ్ లో ఫాసిఫైయర్తో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ… అద్భుతం మొదలైంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పోస్ట్ చేయడమేంటీ ?.. నీకు పెళ్లి జరిగిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన నెక్ట్స్ సినిమా ప్రమోషన్స్ కోసమే నిత్యా ఇలా ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిందని… మరే రీజన్ లేదని అంటూన్నారు ఆమె ఫ్యాన్స్. కానీ నిత్యా మాత్రం తను గురించి వస్తున్న కామెంట్స్ పై ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వెండితెరపైనే కాదు ఓటీటీలోనూ అలరిస్తోంది. ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ షోలో న్యాయ నిర్ణేతగా మెప్పించింది.
ఇక ఛాలెంజింగ్ పాత్రలకు ఎప్పుడు ముందుండే ఈ ముద్దుగుమ్మ మరో ఛాలెంజింగ్ రోల్ కోసం రెడీ అవుతోందని సమాచారం. అందులో కథ మొత్తం నిత్యామీనన్ చుట్టూనే తిరుగుతుందని ఇక ఈ విషయాన్నీ ఇన్ డైరెక్ట్ గా తెలిపేలా నిత్యా ఈ ఫోటో పోస్ట్ చేసినట్లు భావిస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాలి.