Sneha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా కూడా సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. గంగోత్రితో కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ హీరో ఇటీవల వచ్చిన పుష్ప వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ అల్లు ఫ్యామిలీ కి తగ్గ వారసుడిగా కొనసాగుతున్నారు. మొదట్లో మెగా ఫ్యామిలీ అభిమానులంతా బన్నీకి అండగా నిలిచినా… తన కష్టంతో తనకంటూ సొంత అభిమానుల్ని క్రియేట్ చేసుకొని ఈ స్థాయికి ఎదగగలిగారు. ఇక బన్నీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఆయనకు 2011 లో వివాహం జరిగింది. అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు అయాన్, అర్హ.
స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకి కూడా సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఏ ఫోటో షేర్ చేసిన నెట్టింట వైరల్ అవుతుంటుంది. ఇప్పుడు తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అందులో స్నేహ రెడ్డి ధరించిన చీర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె ధరించిన ఈ చీర ధర అక్షరాల ఒక లక్షా 76 వేల రూపాయలు. ఈ చీరను ప్రముఖ డిజైనర్ లో ఒకరైన రిమ్జిమ్ దాదు రూపొందించారని సమాచారం. మెటాలిక్ కార్డ్స్ తో ఈ చీరలు తయారు చేయడం ప్రత్యేకం. దీంతో పలువురు నెటిజన్లు ఈ చీరకట్టులో స్నేహారెడ్డి చాలా అందంగా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తుండగా… పలువురు దాని ధర గురించి చర్చిస్తున్నారు.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఏదైనా ఫోటో పోస్ట్ చేస్తే అందులో ఉండే వాటి గురించి సెర్చ్ చేసి దాన్ని మళ్ళీ చర్చించడం నెటిజన్లకు పరిపాటిగా మారింది. ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన పుష్ప -2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.