Bhakthi షిరిడి సాయి నాధుడిని పూజించే భక్తులు ఎప్పుడూ సాయినాధుడు తమతోనే ఉన్నట్టు భావిస్తారు.. నిత్యం ఆయన్ను పూజిస్తూ ఉంటారు భక్తులు.. అయితే ఆయన జీవితం సుఖమయం చేసుకోవడానికి కొన్ని విషయాలను చెప్పారు అవి ఏంటో తెలుసుకుందాం..
షిరిడి సాయి నాధుడు మనిషి జీవితంలో సుఖసంతోషాలతో ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటించాలని చెప్పుకొచ్చారు.. అవి ఏంటంటే.. మనిషి నాలుక, కోరిక, కోపం ఈ మూడింటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలని చెప్పారు.. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువు, ఆ దైవాన్ని ఎప్పుడు గౌరవించాలి.. అలాగే ధైర్యం, కీర్తి, ప్రశాంతత కోసం జీవితంలో శ్రమించాలి.. పవిత్రత, నిజాయితీ, కటోర శ్రమ ఉన్నవారు ఎప్పుడూ కూడా జీవితంలో ఓడిపోరు ప్రతిరోజు వీటి కోసం బ్రతకాలి అని చెప్పారు.. అలాగే చేసిన వాగ్దానం, స్నేహం, వాత్సల్యాన్ని నిలబెట్టుకోవడానికి జీవితాన్ని అంకితం చేయాలని అన్నారు..
అలాగే మంచి మాట, మంచి నడవడిక, మంచిపని నేర్చుకోవడానికి నిత్యం శ్రమించాలి అన్నారు.. అలాగే సత్ర ప్రవర్తన, దానగుణం, సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలి.. అలాగే చివరగా ఈర్ష, అహంకారం, ద్వేషం జీవితంలో ఎప్పుడు దగ్గరికి రానివ్వకుండా బతకాలని ఆ సాయినాధుడు తన భక్తులకు సందేశం ఇచ్చారు..