Political బ్రిటన్ ప్రధానిగా కేవలం 45 రోజులు మాత్రమే పని చేసిన లిజ్ ట్రస్ ప్రధానిగా తన చివరి ప్రసంగాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా నూతన ప్రధాని రిషి సునాకు శుభాకాంక్షలు తెలిపిన లిజ్ మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..
ప్రపంచ దేశాలను వెళ్ళిన బ్రిటన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది అంతేకాకుండా ఈ సమయంలోనే ప్రధానులు వరుసగా మారుతుండటం కూడా బ్రిటన్ కు కొంత ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పవచ్చు అయితే 45 రోజుల క్రితం ప్రధానిగా ఎన్నికైన లిజ్ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక కావడంతో ఆ పదవికి తాను వీడ్కోలు చెప్పవలసి వచ్చింది అయితే ఈ సందర్భంగా ఆమె బ్రిటన్ ప్రజలను ఉద్దేశిస్తూ ఒక ప్రసంగం ఇచ్చారు..
“బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషి సునాక్‌కి ఆల్ ది బెస్ట్. అయితే ప్రస్తుతం బ్రిటన్ చాలా కష్టకాలంలో ఉంది. దాని నుంచి దేశాన్ని బయటపడేయడానికి సత్వర చర్యలు అవసరం. అయితే ఇంత కష్టకాలం నుంచి బ్రిటన్ కచ్చితంగా బయటపడుతుంది.. బ్రిటన్ పౌరులపై నాకు ఆ నమ్మకం ఉంది.. బ్రిటన్ రాణికి జాతి అంతిమ వీడ్కోలు పలికిన సమయంలో నేను ప్రధానిగా ఉండడం గౌరవంగా ఉంది.. పుతిన్‌పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతోంది. అందరూ ఉక్రెయిన్‌కు మద్దతునీయాలి. అంతేకాదు బ్రెగ్జిట్ వల్ల సొంతంగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందాలి.. దేశ అభివృద్ధి కోసం దేశ పౌరులు అందరూ శ్రమించాలి అప్పుడే బ్రిటన్ ఉన్నత స్థాయిలో ఉంటుంది” అని అన్నారు.