Bhakthi సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల ప్రత్యేకత ఎంతో ఉన్నతమైనది.. నిత్యం భక్తులతో పోటెత్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టు ఉంటుంది.. ప్రస్తుతం కూడా తిరుపతిలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తుల తాకిడి ఎక్కువగా వుంది.. ఆయన చూడటానికి కుటుంబ సమేతంగా ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు తిరుమల కు వస్తూ ఉంటారు.. అయితే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సూర్యగ్రహణం కారణంగా శ్రీవారి దర్శనాన్ని కొంతసేపు ఆపనున్నారు ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది..
గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేస్తారు. బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు. నవంబర్ 8న కూడా ఆలయం మూతపడనుంది.. అంతేకాకుండా బ్రేక్ ప్రత్యేక ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు అంతేకాకుండా అన్నప్రసాద పంపిణీ సైతం నిలిపివేశారు.. అయితే గ్రహణం అనంతరం దేవాలయాన్ని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే మరల భక్తులకు అనుమతిస్తారు..
అలాగే ఈ నెల 25 నవంబర్ 8వ తేదీల్లో సూర్య చంద్ర గ్రహణాల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాన్ని కుదించారు ఈ రెండు రోజుల్లో భక్తులకు సర్వదర్శనం మాత్రమే లభ్యమవుతుంది అంతేకాకుండా గ్రహణాల రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో బ్రేక్ ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు.. అలాగే ఈ సమయంలో అన్న ప్రసాద వితరణ కూడా ఉండదు భక్తులు ఈ విషయాలన్నీ గమనించి టీటీడీకి అనుకూలంగా తమ ప్లాన్ను మార్చుకోవాలని తెలిపారు..