Political ఎంపీ రఘురామరాజు వైసీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు ప్రజల నుంచి మంత్రులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలని పరిస్థితి ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు అంటూ జగన్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు…
ప్రజల నుంచి తమను తాము రక్షించుకునే పరిస్థితి ఈ మంత్రులకు ప్రజాప్రతినిధులకు ఇంత తొందరగా వస్తుందని తాను అనుకోలేదని ఈ కొత్త పద్ధతికి నూతన ఒరవడి చుట్టిన జగన్ అన్న ప్రభుత్వానికి అభినందనలు అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించారు.. ఎవరికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పర్దాలు భారికేట్స్ మధ్య నుంచి ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని ఇకపై ఈ వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు సైతం అదే పొందాను పాటించాల్సి ఉంటుందని అన్నారు.. అంతే కాకుండా టిడిపి ప్రభుత్వం హయాంలో నిర్మించిన గృహాలను చూపించుకుంటూ అవి తామే కట్టామంటూ అన్నిట్లో నెంబర్ వన్ గా ఉన్నామని నిరూపించుకోవాలనుకుంటున్న ఈ వైసీపీ ప్రభుత్వం తీరు విడ్డూరంగా ఉందంటూ దుమ్మెత్తి పోశారు..
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నా ఈ వైసీపీ పాలకులు పద్ధతి సరైనది కాదని అన్నారు ఇది రైతులకు పరీక్షా సమయం కాదని ప్రజాస్వామ్యానికే పరీక్ష అని అన్నారు రాష్ట్రంలో అన్యాయంగా అనాగరికంగా సాగుతున్న అరాచకపు రాచరిక పాలన మధ్య ఆంధ్ర ప్రజలు విలవిల్లా కొట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు.. రాజకీయ ప్రయోజనాల కోసమే వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారని వైయస్ షర్మిల అన్నారు అయితే ఇది నిజమే కావచ్చని వ్యాఖ్యానించిన రఘురామా ఈ హత్యతో లాభం పొందే వాళ్ళు ఎవరనే విషయం త్వరలోనే తేలన ఉందని చెప్పుకొచ్చారు మంత్రులు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల కోసం మాట్లాడ్డం మానేసి దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తే మంచిదని అన్నారు.. ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టిని మరుచేందుకే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారని ఈ కారణాలతో అతన్ని అరెస్టు చేస్తాము అన్న విడ్డూరం పడక్కర్లేదని వ్యాఖ్యానించారు..