Political ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి.. గత కొన్ని రోజులుగా ఆంధ్రాలో జరుగుతున్న సంఘటనలు రాజకీయ పార్టీల మధ్య మరింత విమర్శలకు తావిస్తున్నాయి.. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను విమర్శించిన వైసీపీ నేతలకు జనసేన సైనికులు గట్టి కౌంటర్ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో జరిగిన సంఘటనలతో ఆంధ్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆ తర్వాత ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడికి ప్రయత్నించటం.. దీని అనంతరం జనసైనికులను పోలీసుల అరెస్టు చేయడం వంటి సంఘటనలతో రాజకీయాలు మరింత రచ్చగా మారాయి.. అయితే ఇవి సద్దుమనగట్లేదు సరి కదా మరలా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం మరింత చర్చలకు దారితీసింది.. ఈ విషయంపై వైఎస్ అర్ సీపీ నేతలు విమర్శలు గుప్పించారు.. అంతే కాకుండా మరొకసారి పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూ కామెంట్లు చేశారు.. అయితే ఈ విషయంపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్. తనను ఇంకొకసారి ప్యాకేజి స్టార్ అంటే చెప్పు తీసుకొని కొడతానని చెప్పు చూపించారు.. దీంతో అప్పటినుంచి జనసేన, వైసీపీ మధ్య మాటలు యుద్ధం నడుస్తూనే ఉంది..
అయితే పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తూ అలా తిట్టడం సరికాదని వైఎస్ అర్ సీపీ మంత్రులు నేతలు మండిపడుతున్నారు.. ఈ విషయంపై స్పందించిన జనసైనికులు జగన్మోహన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు…అవనిగడ్డ పర్యటనలో కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారని.. బూతులు తిట్టడంలో వైసీపీ నేతలు వీధి రౌడీలను మించిపోయారని మండిపడ్డారు.