Movie విశ్వక్సేన్, మిధున పాల్కర్, విక్టరీ వెంకటేష్, ఆశాభట్ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఓరి దేవుడా చిత్రం ఈరోజే విడుదలైంది.. అయితే ఈ సినిమా ఎలా ఉందంటే..
ఓరి దేవుడా చిత్రం దీపావళి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే ఈ చిత్రం ఎలా ఉందంటే ప్రతి సన్నివేశాన్ని ఆహ్లాదకరంగా తెరకెక్కించారు కామెడీ తో పాటు ఎమోషన్ కూడా సరైన రీతిలో పండించారు.. అయితే కొన్ని మలుపులతో సినిమాను కొత్తగా చూపించాలి అనుకున్నప్పటికీ మరలా రొటీన్ ధోరణిలోకి తీసుకొచ్చారు కొన్నిచోట్ల సినిమా స్లో మోషన్ లో వెళ్లడం వల్ల ప్రేక్షకులకు ఒకింత బోర్ కొట్టించింది.. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండే ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను ఎక్కువగా కదిలిస్తాయి.. అయితే సినిమా కొంత భాగం చూసేటప్పటికి చివరి వరకు ఎలా ఉంటుందో అనేది ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేస్తాడు.. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో డ్రామా కొట్టొచ్చినట్టు కనిపించిన నెమ్మదిగా నడుస్తున్న భావన కలిగినప్పటికీ ఇందులో ఏ సన్నివేశాన్ని కూడా బోర్ కొట్టించలేదు దర్శకుడు.. చిన్నప్పట్నుంచి కలిసి పెరిగిన స్నేహితురాలు తనకు ప్రపోజ్ చేస్తే ఆమెతో పెళ్లికి ఓకే చెప్పిన కుర్రాడు.. ఆమెతో తనకు సెట్టవ్వక ఇబ్బంది పడే నేపథ్యంలో ప్రథమార్ధం నడుస్తుంది.. ఇందులో హీరో ఇబ్బంది పడే కొన్ని సన్నివేశాలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి.. అలాగే సినిమా ప్రథమార్థంలో ఫాంటసీ యాంగిల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఇందులో ఆధునికంగా కనిపించే దేవుడు పాత్రలో విక్టరీ వెంకటేష్ ఒదిగిపోగా.. ఆయన అసిస్టెంటుగా రాహుల్ రామకృష్ణలతో కలిసి విశ్వక్సేన్ చేసిన సందడి ఆకట్టుకుంటుంది.. అలాగే భార్యా భర్తల మధ్య వచ్చే అభిప్రాయ భేదాలు, గొడవలు, అపార్థాలు, ఆపై విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం ఇదంతా సాధారణ వ్యాపారం లాగే కనిపించినప్పటికీ ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టగలిగాయి… చివరగా ఒక మాటలో చెప్పాలి అంటే ఓరి దేవుడా చిత్రం ఎంటర్టైన్మెంట్ కావాలనుకుని వెళ్లే వారికి కొదవలేదని చెప్పొచ్చు..