Political మునుగోడు ఉప ఎన్నికలవేళ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి.. వాడవేడిగా సాగుతున్న ఎన్నికల ప్రచారం వేళ భువనగిరి మాజీ ఎంపీ నరసయ్య గౌడ్ తెరాస పార్టీ పై విమర్శలు గుప్పించారు..
భువనగిరి మాజీ ఎంపీ నరసయ్య గౌడ్ తెరాస పార్టీపై తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.. బీజేపీ ఉద్యమ పార్టీ అయితే.. తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీ అంటూ విమర్శించారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని అందుకే తాను పార్టీని వీడుతున్నానని చెప్పుకొచ్చారు అయితే ఎన్నాళ్లు పార్టీలో కొనసాగిన ఆయన ఎందుకు పార్టీని వీడుతున్నానో అనే విషయాన్ని ప్రజలు తప్పనిసరిగా గుర్తించాలని చెప్పుకొచ్చారు.. తెలంగాణ భాజాప రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో మాట్లాడిన ఆయన తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా అవతరించిందంటూ విమర్శలు గుప్పించారు..
ఆత్మగౌరవం కోసమే ఇన్నాళ్లు తెరాస పార్టీలో ఉన్న మేమంతా ఆ పార్టీని వీడు బయటకు వచ్చామని తెలంగాణలో భాజపా కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది అంటూ చెప్పారు.. ఈ ఉప ఎన్నిక కారణంగా కేసిఆర్ గట్టుప్పల్ మండలాన్ని ఇచ్చారని ఆయనకు ఓట్లు సీట్లే ముఖ్యమంత్రి చెప్పారు.. ఇప్పుడు కెసిఆర్ కు ఒక్క పోలింగ్ బూత్ కు రెండు కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణలో ఫ్లోరోసిస్ పోయిందని చెప్పుకొచ్చిన కేసీఆర్ ప్రస్తుతం ఫ్లోరోసిస్ కేంద్రం ఎందుకు కోరుతున్నారంటూ ప్రశ్నించారు.. లేని రోగానికి ఎలా వైద్యం చేస్తారంటూ విమర్శలు గుప్పించారు