political మునుగోడు ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్న నేపథ్యంలో ప్రతి పార్టీ తమ ప్రచారాలను వేగవంతం చేసుకుంటూ వెళ్తుంది అయితే ఇలాంటి సమయంలో మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలి వ్యవహారం మరిన్ని చర్చలకు దారి తీసింది.. తాజగా ఈ విషయం పై కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును తప్పు పట్టారు తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్..
ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తుందంటూ చెప్పుకొచ్చారు 2011లో రోడ్డు రోలర్ ఎన్నికల గుర్తుగా ఉండేది అయితే ఈ గుర్తు కారు గుర్తుకే పోలి ఉండటం వలన ఓటు వేసేవారు అయోమయానికి గురవుతున్నారు అంటూ చేసిన విన్నపాలని ఆలకించి ఆ గుర్తును ఎన్నికల నుండి తొలగించారు అయితే మళ్ళీ అదే గుర్తును ఎన్నికల్లో పెట్టడం సరైన పద్ధతేనా అంటూ ప్రశ్నించారు దీనివలన ప్రజలు దీనివలన ఓటు వేసినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారని ఈ రకంగా ఓట్లను చీల్చటానికి బిజెపి చూస్తుందని చెప్పుకొచ్చారు..
అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలని రాజ్యాంగంలో రాసుకొచ్చిన విధానానికి ప్రస్తుతం బిజెపి మాయని మచ్చ తీసుకొస్తుందని అన్నారు.. తమ ప్రయోజనాల కోసం ఈ రకంగా చేయడం ఏమాత్రం తగిన పని కాదంటూ చెప్పుకొచ్చిన కేటీఆర్.. ఈ విషయాన్ని ప్రజలు తప్పకుండా గమనించాలని.. రిటర్నింగ్ ఆఫీసర్ ను బదిలీ చేయడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు..