Gossips టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తొందరలోనే పెద్ద ఫైట్ జరిగేలా కనిపిస్తుంది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ సినిమాలు ఉండబోతున్నట్టు సమాచారం అంతేకాదు ఈ రెండు సినిమాల్లో ఒకేరోజు రాబోతున్నాయని తెలుస్తోంది…
ఒకప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యేవి అప్పట్లో ఏ సినిమా అయినా వంద రోజులు ఆడటం వల్ల కలెక్షన్స్ కు పెద్ద దెబ్బ ఉండేది కాదు కానీ ఇప్పట్లో పరిస్థితి అది కాదు ఇద్దరు సినిమాలు ఒకేరోజు విడుదలవుతున్నాయి అంటే అది పెద్ద విషయమే అవుతుంది.. ఒకప్పుడు ఉన్న హెల్తీ వాతావరణం ఇప్పుడు లేదని చెప్పాలి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ అక్కినేని నాగార్జున ది గోస్ట్ మూవీలో దసరా కానుకగా అక్టోబర్ ఐదు న ప్రేక్షకులు ముందుకు వచ్చాయి అయితే ఈ సినిమాలు రెండు మంచి టాక్నే తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా దూసుకుపోతున్నాయి అయితే ఈ సంక్రాంతి కానుకగా చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నాయని తెలుస్తోంది..
ఫాదర్ మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు నందమూరి హీరో కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకోబోతున్నారు.. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో రచ్చ నడవటం ఖాయమని అంటున్నారు..