Bhakthi : పురాణాల్లో దానానికి విశిష్ట ప్రయోజనాలు ఉన్నాయి అవతలి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నారని ఆలోచన లేకుండా ఎదుటి వారికి సాయం చేయాలి అనే ఆలోచనతో మనస్ఫూర్తిగా చేసేదాన్నే దానం అంటారు.. అయితే ఈ దానానికి ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయి.. ఒక్కో దానానికి ఒక ప్రత్యేకత ఉంది అవి ఏంటో తెలుసుకుందాం..
ఈ కలియుగంలో దానధర్మాలు అనేది మనిషి చేసే పాపాలను కర్మలను విముక్తి చేయటానికి సహకరిస్తాయని తెలుస్తుంది ఎదుటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్న వారికి దానం చేయటానికి వెనకాడ రాదని పురాణాలు చెబుతున్నాయి.. ఎదుటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఎలాంటి స్వలాభం ఆశించకుండా మనసారా ఇచ్చే దేనినైనా దానమనే అంటారు ముఖ్యంగా దీన్ని ధర్మదానము అని అంటారని తెలుస్తుంది..
అలాగే ఆవు పాలు, తోట పువ్వులు, జ్ఞానం, బావి నీరు వంటివి దానం చేయడం వలన విశేష సంపదలు కలుగుతాయని తెలుస్తోంది.. సముద్రంలో పడిన వర్షం అనేది ఎవరికి ఎలా పనికిరాకుండా పోతుందో అన్నీ ఉన్నవానికి చేసే దానం కూడా అదే విధంగా ఎందుకు పనికి రాకుండా పోతుంది అందుకే దానం చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి అర్హతను చూసి దానం చేయాలి.. ఎవరైనా ఆడకముందే వారికి దానం చేయాలి. అలాగే ఎవరైనా అడిగిన తర్వాత మనం చేసే దానం అంతగా ఫలించదు కుడిచే చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి అని చెప్తారు దీని అర్థం ఏమిటంటే దానం చేశామని అందరికీ తెలియక్కర్లేదు ఆ భగవంతుడిని స్మరిస్తూ అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే అతిపెద్ద దానం