Political మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్న నేపథ్యంలో, మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అఖండ విజయం సాధించేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తునట్లు తెలుస్తుంది..
ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికపై భాజపా నాయకత్వం దృష్టి సారించింది. అయితే ఈ నేపథ్యంలో మునుగోడు భాజపా అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెరాస పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ను దుమ్మెత్తి పోశారు..
అలాగే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసిఆర్ మంటల్లో కలిపివేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలంగాణ పదాన్ని తొలిగించారని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికతో తెరాస దోపిడీ దుకాణం బంద్ అవుతుందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. అంతే కాకుండా ఎంత డబ్బు, మద్యం పంచినా ప్రజలు భాజపానే గెలిపిస్తారన్నారు.. రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి తెరాసకు బుద్ధి చెప్పాలి అన్నారు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెలంగాణ అనే పదాన్ని తమ పార్టీ పేరు నుంచి తొలగించడం సరైన పద్ధతి కాదని ఆ పార్టీ నేతల అహంకారాన్ని దెబ్బతీయటానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.. ఎన్నికల్లో గెలిచేందుకు మద్యం, డబ్బు ఎంతగా పంచినా ప్రజలు బిజెపికి ఓటేస్తారని అన్నారు. అధికారంలో ఉన్నామని అహంకారంతో చెలరేగిపోతున్న తెరాస నాయకులకు ఈ ఎన్నికలతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని అన్నారు..